Authorization
Fri March 21, 2025 06:44:46 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో ఆదివారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డివిజన్ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్‌తో కలిసి రూ.150.2 లక్షల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.8.20. లక్షలతో సన్న మిల్క్ డైరీ సమీపంలో రూ.24.50 లక్షలతో, శాంతి నికేతన్ రూ.45.50 లక్షలతో దుబారు గేట్ నుంచి ఫాతిమా మసీద్ వరకు సీసీ రోడ్ల పనులకు, రూ.72 లక్షలతో హస్మత్‌పేట, గౌడ్స్ శ్మశాన వాటికకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మెన్ నరేందర్ గౌడ్, సదరన్ రైల్వే బోర్డ్ మెంబెర్ కర్రె జంగయ్య, మాజీ కౌన్సిలర్లు కర్రె లావణ్య, మక్కల నర్సింగ్ రావు, నియోజకవర్గ అధ్యక్షుడు ఇజాజ్, డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్, డివిజన్ జనరల్ సెక్రెటరీ హరినాథ్, నియోజకవర్గ మహిళా కార్యదర్శి సరోజ, డివిజన్ మహిళా అధ్యక్షురాలు లలిత పాల్గొన్నారు.