Authorization
Fri March 21, 2025 02:45:13 pm
- కార్పొరేటర్ ఆవులరవీందర్ రెడ్డి
నవతెలంగాణ-బాలానగర్
రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేయాలనికార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి కాంట్రాక్టర్, అధికారులకు సూచించారు. బాలానగర్ డివిజన్ పరిధి బీబీఆర్ హాస్పిటల్ పక్కనగల నాలాపై జరుగుతున్నా వంతెన నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ ఏఈ రషీద్‌తో కలిసి గురువారం పర్యవేక్షించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, త్వరలో ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఏఈ కవిత, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎడ్ల మోహన్ రెడ్డి, నాయకులు ఎం.ఎస్ కుమార్, బాజని నాగేందర్‌గౌడ్, ఆదిముళ్ల నగేష్, రామచంద్ర చారి, ప్రేమ్ కుమార్ తదితరులు ఉన్నారు.