Authorization
Tue March 18, 2025 02:10:09 am
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ట్రాన్స్కో రాష్ట్ర అధ్యక్షుడు మోత్కూరి శరబంధకు తెలంగాణ ప్రభుత్వం దళితరత్న అవార్డును అందించింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో ఆయనకు ఈ అవార్డును బహుకరించారు. ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల కోసం ఆయన అహర్నిశలు సేవలందిస్తున్నారు. మహనీయుల ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. శరబంధ మరెన్నో ఉన్నతమైన సేవలు అందిస్తూ ఉత్తమ అవార్డులు అందుకోవాలనీ, ఉన్నత పదువులు అధిరోహించాలని ఎస్సీ,ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి శ్యామ్ మనోహర్, ప్రధాన కార్యదర్శి మేడి రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ కె చంద్రయ్య, అసోసియేట్ ప్రెసిడెంట్ ఆర్ నాంపల్లి తదితరులు ఆకాంక్షించారు. శరబంధకు స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఉద్యోగులు అభినందనలు చెప్పారు.