Authorization
Fri March 21, 2025 05:56:49 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ఆధ్వాన్నంగా మారిన రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని సీపీఐ కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి ఈ.ఉమామహేష్ అన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని మైసమ్మనగర్లో డ్రైనేజీ పనులు చేపట్టిన అనంతరం తవ్విన రోడ్డును బాగు చేయకుండ వదిలేయడంతో ఆదివారం సీపీఐ ఆధ్వర్యంలో బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైసమ్మనగర్లో రోడ్డు వేయడానికి బడ్జెట్ కేటాయించి న్నప్పటికి అధికారులు రోడ్డు వేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రోడ్డుపై లెవల్ చేయడానికి కంకర వేసి నెలలు గడుస్తున్న కంకర వేయకపొవడం సిగ్గు చేటన్నారు. అధికారులు స్పందించకపోతే ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి అధ్యక్షులు ప్రవీణ్, ఏఐటీయూసి అధ్యక్షులు హరినాథ్, ఏఐవైఎఫ్ కార్యదర్శి వెంకటేష్, సీపీఐ నాయకులు వెంకటేష్, చంద్రయ్య, బస్తీ వాసులు కె.రాజు, పాపిరెడ్డి, ఉప్పలయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.