Authorization
Tue March 18, 2025 02:10:10 am
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ల వద్ద బుధవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానిక ప్రజల ఫిర్యాదుల మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న వాటర్ ట్యాంకర్, ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. మున్సిపల్ కమిషనర్, డీఈలు దాసయ్య, సుదర్శన్ రావు, ఏ.ఈ లక్ష్మీ నారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.