Authorization
Fri March 21, 2025 12:51:29 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ఏటీఎంలు నిరుప యోగంగా ఉన్నాయని కౌన్సిల్ సమా వేశంలో లింగోజీగూడ డివిజన్ కార్పొరేటర్, గ్రేటర్ కౌన్సిల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్రెడ్డి ప్రశ్నించడంతో జీహెచ్ఎంసీ కమిషనర్, మేయర్ స్పందించి, లింగోజీగూడలో వాటిని తొలగించారు. తొలగించి నందుకుగాను రాజశేఖర్ రెడ్డి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిధులు వృధా కాకుండా అవసరమయ్యే వాటికి వినియోగించాలని ఆయన కోరారు.