Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మారేడ్‌పల్లి వాటర్‌వర్క్స్ ఆఫీసు ఎదుట ధర్నా
నవతెలంగాణ-ఓయూ
అడ్డగుట్టలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని సీఐటీయూ, ఐద్వా, డీవైఎఫ్ఐ, పట్నం సంయుక్త ఆధ్వర్యంలో గురువారం మారేడుపల్లి వాటర్‌వర్క్స్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అడ్డగుట్ట ఏ,బీ,సీ,డీ సెక్షన్లలో తాగునీళ్లు అధికారులు తగ్గించారని, నల్లానీటి సమస్య విపరీతంగా ఉందన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న జనాభాను దష్టిలో పెట్టుకోకుండా వాటర్‌ను తగ్గించడం అన్యాయం అన్నారు. అడ్డగుట్టలో అష్టకష్టాలు పడి నల్లా కనెక్షన్ తీసుకుంటే నీళ్లు రాకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇంకోవైపు కమీషన్ల కోసం రోడ్లు వేస్తున్నారా? అనిపించేలాగా అడ్డగుట్ట పరిస్థితి ఉందన్నారు. సీసీ రోడ్లు వేసేటప్పుడు తాగునీటి, డ్రయినేజీ పైపులైన్లు సక్రమంగా వేస్తే బాగుంటుందనే ఆలోచన లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శంగా చెప్పవచ్చు అని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అడ్డగుట్టలో తాగునీటి, డ్రయినేజీ, రోడ్డు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. ధర్నా కార్యక్రమంలో సీఐటీయూ నగర నాయకులు అజరు బాబు, ఐద్వా నగర కార్యదర్శి నాగలక్ష్మి, పట్నం నగర కార్యదర్శి మారన్న, నాయకులు అంజమ్మ, అలేఖ్య, సుజ్ఞాని, నవీన్, ఎల్లయ్య, భాషప్పా, నవిత, విజయ, పద్మ, యాదమ్మ, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.