Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
ఘట్కేసర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టంను ఏర్పాటు చేయొద్దని బ్రూక్ బాండ్ కాలనీవాసులు మే డ్చల్ జిల్లా కలెక్టర్ హరీష్, అడిషనల్ కలెక్టర్ జాన్ శ్యాంసన్, డీిఎంహెచ్‌ఓ శ్రీనివాస్, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఎంపీడీవో అరుణ, డిప్యూటీ తాసిల్దార్ భాస్కర్‌రెడ్డి, చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్, మున్సి పల్ కమిషనర్ వసంతలను వేర్వేరుగా కలిసి వినతిపత్రం అందజేశారు. కాలనీ మధ్యలోనే ఆస్పత్రి ఉండడంతో ఆస్పత్రిలో పోస్టుమార్టం ఏర్పాటు చేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పాలవుతారని అంతేకాకుండా ఆ దుర్వాసనతో అనేక రోగాల పాలు అవుతారని, వెంటనే అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కాలనీవాసులు కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ఎండి సిరాజ్, కలశం గోపాలకష్ణ, లంబ అశోక్, గోదా లక్ష్మణ్ యాదవ్, గోదా భాస్కర్ యాదవ్, గుర్రం రమేష్, మానుక కుమార్, శివ లింగం యాదవ్, రాధాకష్ణ యాదవ్ పాల్గొన్నారు.