Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేషన్ అభివద్ధి కోసం పక్కా ప్రణాళికలతో ముందుకు
- 34 అంశాలపై కౌన్సిల్ తీర్మానం
నవతెలంగాణ-బోడుప్పల్
ప్రజలు తమ పాలకవర్గంపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పారదర్శకంగా పాలన అందించేలా ముందుకు సాగుతున్నా మని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం నాడు పీర్జాడిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో 34 అంశాలతో కూడిన ఎజెండాను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలోని సాయి ఐశ్వర్య కాలానీలో ఉన్న పార్క్ స్థలానికి సంరక్షణకు ఫెన్సింగ్ వేయుటకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. వేసవిలో తాగునీటి నమస్య లేకుండా క్రమం తప్పకుండ మంచినీరు సరఫరా చేసి, అవసరమైన చోట కొత్త పైప్ లైన్‌తో పాటు జంక్షన్ నిర్మించడం.వీధి వ్యాపారులకోసం ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్న స్ట్రీట్ వెండింగ్ జోన్ త్వరగా పూర్తి చేసి అర్హులైన వారికి అందించడం.దోమల నివారణకు నీటి నిల్వ ఉండే ప్రాంతాలలో ఆయిల్ బాల్స్, అవసరమైన కొత్త ఫాగింగ్ మిషన్లను కొనుగోలు చేయడం. నిరూపయోగ, రోడ్డుకు అడ్డుగా ఉన్న కరెంట్ స్తంబాలను వేరే చోటుకు మార్చడం, అవసరమైన ప్రాంతాలలో వీధి దీపాల ఏర్పాటు చేయడం. కుక్కలు, పందులు, కోతుల నివారణకు అవలంభించాల్సిన ప్రణాళిక సిద్ధం చేయడం, నేరాల నివారణకు గతంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలను పూర్తి స్థాయిలో అనుసంధానం చేసి ఇంకా అవసరమైన చోట కొత్త వాటిని ఏర్పాటు చేయడం, రెవిన్యూ, మున్సిపల్ అధికారుల సమన్వయంతో ప్రభుత్వం స్థలాలు అన్యాక్రాంతం కాకుండా సంరక్షించడంతో పాటు ముఖ్యంగా తెలంగాణ యూత్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో ఈనెల 30వ తేదీన సెట్విన్ ఆవరణలో జరగబోయే ''జాబ్ మేళా''ను అన్ని డివిజన్లలో క్షేత్రస్థాయిలో ప్రచారం చేసి విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కమిషనర్ డా.పి రామకష్ణ రావు, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్‌గౌడ్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్, రెవిన్యూ, ఎచ్ఎండబ్యూఎస్ అధికారులు, విద్యుత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.