Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డుపై చెత్తతో సీఐటీయూ ధర్నా
నవతెలంగాణ-ధూల్‌పేట్
స్వచ్ఛ ఆటో కార్మికులపై ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఆపాలని సీఐటీయూ రాష్ట్ర నాయకులు సి మల్లేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం గుడిమల్కాపూర్ సమీపంలో స్వచ్ఛ కార్మికులతో కలిసి రోడ్డుపై చెత్తతో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడిమల్కాపూర్ బుడిగె జంగం బస్తీ సింగ్ టెంపుల్ దగ్గర స్వచ్ఛ ఆటో కార్మికుల కుటుంబాలు 50 ఉన్నాయని తెలిపారు. వారు ప్రతి రోజు గోల్కొండ, నాంపల్లి, బంజారాహిల్స్, రాజేంద్రనగర్, కార్వాన్ వివిధ ప్రాంతాల్లో చెత్త సేకరణ చేస్తారన్నారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన స్వచ్ఛ ఆటోలు పార్కింగ్ చేస్తే టోలిచౌకి ట్రాఫిక్ పీఎస్ పోలీసులు ఇక్కడ పెట్టొద్దని ఆటో రెండు తీసుకెళ్తున్నారన్నారు. ఈ కార్మికులు 40 ఏండ్లు గుడిసెల్లో ఉంటూ వివిధ ప్రాంతాలలో చెత్త సేకరణ చేసి జీవనం కొనసాగిస్తున్నారన్నారు. రాంకీ పేరుతో డంపింగ్ యార్డ్‌లో జియాగూడలో 300 స్వచ్ఛ ఆటోలు లైన్లో ఉంటున్నాయన్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఖాళీ చేసి తిరిగి రావాల్సివస్తుందన్నారు. అనంతరం స్వచ్ఛ ఆటో కార్మికులపై పోలీసుల వేధింపులు ఆపాలని ఆసిఫ్‌నగర్ సీఐ రవీంద్రకు విన్నవించుకున్నారు. కార్యక్రమంలో బస్తీవాసులు అంజయ్య, లక్ష్మణ్, వాసు, కిరణ్, రాజు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.