Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
నవతెలంగాణ-అంబర్‌పేట
నియోజకవర్గవ్యాప్తంగా విస్తతంగా పాదయాత్రలు చేపడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. శుక్రవారం గోల్నాక తులసీనగర్ కాలనీ సాయిబాబా గుడి లేన్, అశోకానగర్, లక్ష్మినగర్ తదితర ప్రాంతాల్లో పలు శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భగా స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా తమ బస్తీల్లో కలుషిత తాగునీటి సమస్య పరిష్కరించాలని స్థానికులు ఎమ్మెల్యే దష్టికి తీసుకువచ్చారు. అలాగే అరకొర తాగునీటి సరఫరాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అశోక్‌నగర్, లక్ష్మినగర్ తదితర ప్రాంతాల్లో కొత్త తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సీజీఎం ఆనంద్‌నాయక్, జీఎం సుబ్బారాయుడు, డీజీఎం బ్రహ్మారెడ్డి, మేనేజర్ రోహిత్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు సంతోష్, అనిల్ తదితర నాయకులు పాల్గొన్నారు.