Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగేండ్లుగా బకాయి ఉన్న పీఆర్సీని వెంటనే విడుదల చేయాలి
- ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పల్లం ప్రవీణ్
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
డాక్టర్ల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పల్లం ప్రవీణ్ అన్నారు. శుక్రవారం టీజీజీడీఏ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులకు రావాల్సిన (నాలుగేండ్ల) పెండింగ్ పీఆర్సీ వేతనాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో సాధించుకున్న (ఈఎల్) సెలవులను పునరుద్ధరించాలని, వైద్యులకు ప్రమోషన్లు, ప్రభుత్వ వైద్య సిబ్బందికి ప్రభుత్వం ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. టీజీజీడీఏను విచ్చిన్నం చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని, వారిని వైద్యులు నమ్మకూడదని సూచించారు. ప్రభుత్వ వైద్యుల సంఘంలో సభ్యత్వం ఉన్న డాక్టర్లు సంఘాన్ని కట్టుబడి ఉండాలన్నారు. వైద్య శాఖలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే రానున్న రోజుల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.