Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
సామాజిక అంశాలతోపాటు కమర్షియల్ షార్ట్ ఫిలిమ్స్ కూడా విద్యార్థులు రూపొందించాలని దర్శకనిర్మాత నర్సింగ్ రావు అన్నారు. శుక్రవారం కింగ్ కోఠి లోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ, పీజీ కళాశాలలోని సెమినార్ హాల్లో నేషనల్ స్టూడెంట్స్ ఫిలిం ఫెస్టివల్ ఈ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ వీసీ రవీందర్. దర్శకనిర్మాత నర్సింగ్ రావు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుందర్రెడ్డిలు పాల్గొని స్టూడెంట్స్ ఫిలిం ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు నర్సింగ్‌రావు మాట్లాడుతూ... విద్యార్థులు డాక్యుమెంటరీ ఫిలిమ్స్, సామాజిక, కమర్షియల్ షార్ట్ ఫిల్మ్ లు తీయాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ షార్ట్ ఫిలింలను ప్రదర్శించారు. అనంతరం కుత్త మా షార్ట్ ఫిలిం అవార్డును ఉదరు అందించారు. రానున్న రోజుల్లో మరింతగా రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సినీ రచయిత భాస్కరభట్ల. విశ్వేశ్వరరావు, నటుడు ఆకాశ్‌పూరి. ఉదరు, శివ, .ప్రశాంత్ రాయి, వివిధ రాష్ట్రాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.