Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా టీటీయూసీ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో ఆది వారం వారి కార్యాలయం వద్ద టీటీయూసీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర నాయకులు జూపల్లి శ్రీనివాస్, మల్కాజిగిరి అధ్యక్షులు సంజరు, గబ్బర్, బల్వంత్ రెడ్డి, జయరుద్దీన్, నరసింహ, ప్రసాద్, సదానంద్, రాజు, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
సుల్తాన్ బజార్ : బొగ్గులకుంట ఆదిత్య ఆస్పత్రి వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలను నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సౌత్ జిల్లా ఉపాధ్యక్షులు సోమయ్య. మీనా, హనుమంతు, రవి, శీను, నిరుపమ, సువర్ణమ్మ, తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ : వెంగల్రావు నగర్ డివిజన్ మధుర నగర్లో గల స్టేట్ హౌమ్ శిశు విహార్లో మే డే వేడుకలు నిర్వహించారు. శిశువిహార్ సీఐటీయూ యూనియన్ కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేస్తున్న ప్రధాన కార్యదర్శి సుజాత, అధ్యక్షులు ఈశ్వరరావు.
ధూల్ పేట్ : సీఐటీయూ ఆధ్వర్యంలో గౌలిగూడ చమన్ లేబర్ అడ్డా, బేగం బజార్ లేబర్ అడ్డాలో మేడే సందర్బంగా జెండా ఆవిష్కరణలు చేసి అనంతరం జరిగిన సభలో ముఖ్య అథితిగా పాల్గొన్న సీఐటీయూ హైదరబాద్ సౌత్ జిల్లా ఉపాధ్యక్షులు కే.జంగయ్య. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఎన్.వెంకటేశ్, గంగపురి, టి.ఆంజనేయులు కే.వెంక టేశ్, గోపాల్, కే.రాజు, బాలరాజు పాల్గొన్నారు.
ఓయూ : మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా అడ్డగుట్ట చౌరస్తా, ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర, తుకారం గేట్, శాంతినగర్, తార్నాక, మెట్టుగూడ, సీతాఫల్మండి వద్ద జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోన్ కన్వీనర్ అజరు బాబు, నాయకులు అంజమ్మ, గోపాల్, బాలయ్య, కృపాకర్, సునంద, అలేఖ్య, రమ, భీమయ్య, ప్రవీణ్, కార్తీక్, తారాబాయి, శశికళ, నవిత, జ్యోతి పాల్గొన్నారు.
ఉమర్ ఖాన్ ఆధ్వర్యంలో..
మేడే వేడుకలు సికింద్రాబాద్ నియోజకవర్గంలో పలు చోట్ల ఏఐటీయూసీ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమర్ ఖాన్ ఆధ్వర్యంలో జెండా ఎగుర వేశారు.
బంజారాహిల్స్ : మేడే సందర్భంగా సీఐటీయూ నిమ్స్ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజానాట్యమండలి కళాకారులతో ఆటపాటలతో ర్యాలీ జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నగర అధ్యక్షుడు ఈశ్వర్ రావు, నగర కోశాధికారి వాణి, యూనియన్ నాయకులు, జనరల్ సెక్రెటరీ బాలయ్య పాల్గొన్నారు.
బంజారాహిల్స్ : ఎల్.వి.ప్రసాద్ ఆస్పత్రి వద్ద మేడే ఉత్సవాలను సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అడ్వైజర్ రామచంద్రరావు, అధ్యక్షులు రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రహ్లాద్, కార్యదర్శి అశోక్, మహిళలు పాల్తొన్నారు.
ధూల్ పేట్ : పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన అవసరం ఉందని సీఐటీయూ నగర నాయకులు అబ్దుల్ సత్తార్ అన్నారు. యాకుత్పురా లేబర్ అడ్డా దగ్గర మే డే జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అడ్డా నాయకులు ఎం.రాములు, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.