Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
జన విజ్ఞాన వేదిక కాప్రా మల్కాజ్గిరి, కీసర మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిక్షణా శిబిరంలో విద్యార్థులకు కెమిస్ట్రీ పాఠాలను చిన్న చిన్న ప్రయోగాలు చేయటం ద్వారా ఎంత సులువుగా విద్యా ర్థులు నేర్చుకోవచ్చును. ప్రయోగాలు చేస్తూ విద్యార్థుల చేత ప్రయోగాలు చేపిస్తూ కేంద్రీయ విద్యాలయ అధ్యాప కులు శోభన్ బాబు శిక్షణ నిచ్చారు. కెమిస్ట్రీలో ఉన్న అనేక ఫార్ములాలకు సంబంధించిన ప్రయోగాలను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా సులువుగా తాము అంతట తామే చేసుకునే విధంగా ఈ శిక్షణ కార్యక్రమం సాగింది. కేంద్రీ య విద్యాలయ అధ్యాపకులు శోభన్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు కెమిస్ట్రీ, ఫిజిక్స్ కఠినమైన సబ్జెక్టులుగా భావిస్తున్నారనీ, అందువల్లే విద్యార్థులు ఈ సబ్జెక్టులపై దృష్టి పెట్టి చదవలేక పోతున్నారన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రతి పాఠశాల ప్రయోగశాలను ఏర్పాటు చేయాలనీ, ఈ సబ్జెక్టులను ప్రయోగశాలలోనే ప్రయోగాల రూపంలోనే నేర్పించాలనీ, తద్వారా విద్యార్థులు సులువుగా తాము కూడా ప్రయోగాలు చేయడం ద్వారా నేర్చుకుంటా రు. అలా నేర్చుకున్న వాటిని వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేర న్నారు. నేటి విద్యావిధానంలో సమూలమైన మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. నేడు అనేక పాఠశాలలో పేరుకే ప్రయోగశాల రూములు ఉంటాయి కానీ వాటిలో ప్రయోగాలు చేయరు అన్నారు. ఈ కార్యక్రమంలో వేసవి శిక్షణా శిబిరం ప్రిన్సిపాల్ శివ ప్రసాద్, మల్లికా, పటేల్ నరసింహ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.