Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో డ్రైవర్లకు ప్రత్యేక గుర్తింపు కోసం తెలంగాణ రాష్ట్ర క్యాబ్స్ ప్రొటెక్ట్ ట్రేడ్ యూనియన్ (టీఆర్సీపీటీయూ) పోరాటం చేస్తుందని హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఆలేటి బాల్రెడ్డి అన్నారు. శనివారం నగర కార్యాలయంలో మేడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలతో ప్రాణాలు పోగొట్టుకుని వారి కుటుంబాలు రోడ్డు పాలవుతున్న క్రమంలో వారిని ఆదుకునేందుకు డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. నాలుగు కొత్త కార్మిక చట్టాలను రద్దు చేయాలనినీ, ఆప్ ఆధారిత ప్రజా రవాణా సంస్థల్లో 12 గంటలు పని అమలయ్యేలా చూడాలన్నారు. డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తేవాలన్నారు. పెరిగిన జీవన, డీజిల్ ధరలకు అనుగుణంగా ప్రభుత్వం స్పందించి ధరల ప్రకటన చేయాలనీ, ఎంవీ యాక్ట్-2019 అమలు చేయవద్దని డిమాండ్ చేశారు.