Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజేతలకు లక్ష రూపాయలు, రన్నర్ టీంకి 50వేల ప్రైజ్‌మనీ
- నాయిని నర్సింహారెడ్డి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-అడిక్‌మెట్
నాయిని నర్సింహారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాయిని మెమోరియల్ క్రికెట్ లీగ్ బుధవారం ప్రారంభం కానున్నాయి. ఇందిరా పార్క్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే ఈమ్యాచ్ లను శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, సెంట్రల్ జోన్ డీసీపీ రమణారెడ్డి ఉదయం 9 గంటలకు టాస్ వేసి ప్రారంభిస్తారు అని నాయిని నర్సింహారెడ్డి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం అడిక్‌మెట్ డివిజన్లోని ఈ సేవా సెంటర్ వద్ద గల దావత్ ఫంక్షన్ హాల్లో క్రికెట్ లీగ్ ట్రోఫీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాయిని నర్సింహారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని నిజామాబాద్, కరీంనగర్, ఓల్డ్‌సిటీ, ముషీరాబాద్, కామారెడ్డి తదితర ప్రాంతాల నుంచి క్రికెట్ టీమ్ పాల్గొంటాయని తెలిపారు. ఐదు రోజులు జరుగు క్రికెట్ ఆటలో దాదాపు 80 కి పైగా టీమ్‌లు పాల్గొంటాయని అన్నారు. 4, 5, తేదీల్లో లీగ్ మ్యాచ్ లు, 6,7 తేదీల్లో క్వార్ట్ర్, సెమీ ఫైనల్, 8న ఫైనల్ మ్యాచ్ లు జరుగుతాయని తెలిపారు. విజేతలకు ట్రోఫీతోపాటు లక్ష రూపాయలు, రన్నర్ టీమ్‌కు 50వేల ప్రైజ్‌మనీ తెలంగాణ జాగతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కమిషనర్ సీవీ ఆనంద్ చేతుల మీదుగా అందించడం జరుగుతుందని తెలిపారు. నాయిని నర్సింహారెడ్డి ఫౌండేషన్ ద్వారా నిర్వహించే క్రికెట్ లీగ్ మ్యాచ్‌లను డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా సే నో టు డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నేత శ్రీను, సిరిగిరి శ్యామ్, కలువ గోపి, టక్కర్ శ్రీను, శ్రీకాంత్ పాల్గొన్నారు.