Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసమానతను పెంచే నిరసన ఉండొద్దు: మహిళా సంఘాల నేతలు
నవతెలంగాణ-ఓయూ
ఇటీవలే కాలంలో రాహుల్ గాంధీ ఓయూ విద్యార్థులతో ముఖాముఖి కోసం ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్‌ను అనుమతి కోరగా, యూనివర్సిటీ అకడమిక్ పరిరక్షణ దష్ట్యా పర్మిషన్ ఇవ్వడం కుదరదని చెప్పారు. ఇది ముమ్మాటికి టీఆర్ఎస్ అనుకూల నిర్ణయం అని ప్రకటించిన కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్‌కి గాజులు, చీరల పంపుతూ నిరసన వ్యక్తం చేశారు. మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ ఎదుట విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘం జాతీయ కన్వీనర్ సంధ్య, రాష్ట్ర అధ్యక్షురాలు కామ్రేడ్ ఝాన్సీలు మాట్లాడుతూ యూనివర్సిటీలు జ్ఞానకేంద్రాలుగా ఉంటాయన్నారు. ప్రశ్న సమాధానం సమన్వయమని పద్ధతుల్లో చర్చలు జరిగి సమాజ ఉన్నతికి పాటుపడతారని చెప్పారు. ఇలాంటి యూనివర్శిటీల్లోకి కాంగ్రెస్ జాతీయ అధినేత రాహుల్ గాంధీ పర్యటనకు పర్మిషన్ ఇవ్వకపోవడం అప్రజాస్వామికమన్నారు. ప్రెసిడెంట్ సహించలేని నిరంకుశ ప్రభుత్వం ఎక్కడ ఉన్నా నిరసన ఉద్యమాలతో హక్కులు సాధించుకోవాలని వారు తెలియజేశారు. నిరసన ఉద్యమాలు మహిళలను కించపరుస్తూ ఉండకూడదని వారు అభిప్రాయపడ్డారు. నేటి సమాజంలో మహిళలు గాజులు చీరలు కట్టుకుని కూడా ఎన్నో విజయాలు సాధించారని, మహిళలను అచేతనంగా భావించడం విష సంస్కతిలో భాగమని వారు తెలియజేశారు. ప్రాచీన కాలపు మనువాద స్త్రీ వ్యతిరేక విధానాలను, పోరాట రూపాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యాపకులు ప్రొఫెసర్ సమున్నత, డాక్టర్ ఇ. ఉపేందర్, పీడీఎస్‌యూ అధ్యక్ష కార్యదర్శులు మామిడికాయల పరశురాములు, పీ. మహేష్, సుధీర్, రాకేష్ అనిల్ పాల్గొన్నారు.