Authorization
Fri March 21, 2025 07:11:48 am
నవతెలంగాణ-అడిక్మెట్
కాంగ్రెస్ పార్టీ ప్రధాన నేత పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవడం హేయమైన చర్య అని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లాపెళ్లి అంజి అన్నారు. ఈ మేరకు మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సహకారంలో ముఖ్య భూమిక పోషించిన కాంగ్రెస్ పార్టీ నేతను ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన అడ్డుకుని తెలంగాణ కతజ్ఞత లేని రాష్ట్రంగా అప్రతిష్టపాలు చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో వివిధ అంశాలతో ముఖ్య నాయకులు పిలుచుకొని సంప్రదించడం మొదటి నుంచి ఉందన్న విషయం ప్రభుత్వం పరిశీలించాలని కోరారు.