Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెహదీపట్నం
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని సీపీఐ(ఎం) కార్వాన్ డివిజన్ కార్యదర్శి జి.విఠల్ అన్నారు. మంగళవారం అల్లూరి సీతారామరాజు నగర్లో కార్వాన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సీపీఐ(ఎం) జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సామాన్య ప్రజల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని వాపోయారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరుచేస్తామని ఇచ్చిన హామీ ఆచరణలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బుద్ధి తెచ్చుకొని తమ ప్రజావ్యతిరేక విధానాలను వీడాలని, లేకపోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) కార్వాన్ డివిజన్ ఇన్చార్జి కళ్యాణ్, నాయకులు భాగ్య, హనుమంతు, భూలక్ష్మి, గంగమ్మ, నీల, సరిత, మెహరునీసా బేగం, నాగమణి, నర్సింగ్, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.