Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
కాప్రా సర్కిల్ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలో ఉన్న మణికంఠ డిజిటల్ స్టూడియోలో సోమవారం రాత్రి జరిగిన షార్ట్ షాక్ సర్క్యూట్‌తో పోటో స్టూడియో పూర్తిగా దగ్ధమైంది. స్టూడియోలోని నాలుగు పోటో కెమెరాలతో పాటు, ఒక్క డ్రోన్ కెమెరా, నాలుగు కంప్యూటర్లు, సుమారు రూ.20 లక్షల విలువగల ఆస్తి నష్టం జరిగిందని షాపు యజమాని ఈగల రవీందర్ తెలిపారు. షాక్ సర్క్యూట్ ద్వారా ఫోటో స్టూడియో పూర్తిగా మంటల్లో కాలిపోయింది. దీంతో రవీందర్ ఆధారం కోల్పోయాడనీ, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలనీ, అతని కుటుంబానికి తగిన సాయం చేయాలని కాప్రా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ ప్రభుత్వాన్ని కోరారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు బీఎల్ఆర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి షాక్ సర్క్యూట్‌కు గల కారణలను అడిగి తెలుసుకున్నారు. తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీనిచ్చారు.