Authorization
Sat March 22, 2025 01:28:42 am
నవతెలంగాణ-కేపీహెచ్బీ
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు స్పందించి వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ పట్టణ నాయకులు ఎం.శంకర్, బి.శ్రీనులు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై మంగళవారం సీఐటీయూ పట్టణ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో హైదర్నగర్ బస్తీలో సర్వే నిర్వహించారు. బస్తీలో అండర్ గ్రౌండ్ డ్రయినేజీ, రోడ్డు, విద్యుత్ పోల్స్ మార్చుట, తాగునీటి సమస్యలను స్ధానికులు వారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదర్నగర్ బస్తీలో చాలా సమస్యలున్నాయనీ, అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బస్తీలోని సమస్యలపై సర్వే నిర్వహించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేష్, వెంకటేష్, నర్సింహా, మోహన్, చందర్, రమేష్, షాదుల్లా, తదితరులు పాల్గొన్నారు.