Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో యువత పాత్ర ప్రధానమైనదనీ, విద్యా, వైద్యం, ఉపాధి హక్కుల సాధన కోసం ఏఐవైఎఫ్ నిరంతరం కృషి సల్పిస్తుందని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర మాజీ సభ్యులు పి.సుధాకర్ అన్నారు. ఏఐవైఎఫ్ 63వ ఆవిర్భావ దినోత్స వాన్ని పురస్కరించుకుని జిల్లా సమితి ఆధ్వర్యంలో నీలం రాజశేజర్ రెడ్డి భవన్ ఎదుట జెండాను ఎగరేశారు. ఈ సందర్భంగా పి.సుధాకర్, ఏ ఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి సత్య ప్రసాద్, ధర్మేంద్ర మాట్లాడుతూ యువతరంలో ప్రగతిశీల అభ్యుదయ భావాలు, దేశభక్తి లౌకిక ప్రజాస్వామిక ఆలోచనలు, నైతిక విలువలు, మానవత్వాన్ని నెలకొల్పడానికి అఖిలభారత యువజన సమాఖ్య నిరంతరము కృషి చేస్తుందన్నారు. దేశం కోసం ప్రాణార్పణ చేసిన సర్దార్ భగత్ సింగ్, చంద్ర శేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు 1959 మే 3 తేదీన ఏఐవైఎఫ్ ఢిల్లీలో ఆవిర్భవించిందని తెలిపారు. 18 ఏండ్లు నిండిన యువతకు ఓటు హక్కు కోసం పోరాడి విజయం సాధించింది తెలిపారు. కుల, మత, విచ్చిన్నకర వాదులకు ఎదురొడ్డి నిలిచిందనీ, అంటరానితనం, సాంఘిక దురాచారాలు, మూఢనమ్మ కాలకు వ్యతిరేకంగా యువతను పెడదోవ పట్టిస్తున్న మద్యపానం, అశ్లీల సాహిత్యం, అర్ధనగ సినిమాలకు వ్యతిరేకంగా ''క్విట్ అశ్లీలత'' పేరుతో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తుందన్నారు. యువజన సంఘం దేశంలోని అన్ని అంశాలపై పోరాటాలు నిర్వహించి, ప్రజా అభ్యున్నతికి పాటుపడాలన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం నిరుద్యోగ యువతతో సమరశీల పోరాటాలు నిర్వహించిన సంఘం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పరీక్షలకు అభ్యర్ధించే ప్రతి నిరుద్యోగ యువతకూ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్టడీ మెటీరియల్స్‌ను యుద్ధ ప్రాతిపదికన ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఏడే.సతీష్ కుమార్, రాకేష్, జిల్లా ఆఫీస్ బేరర్ సభ్యులు రాజ్ కుమార్, నవీన్, విజయ్, హరికృష్ణ, ప్రసాద్, రమేష్, మణి, భూపతి, తదితరులు పాల్గొన్నారు.