Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్
రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్న సంపన్నులకు ఓటు బ్యాంకు లేదు కానీ, నోటు బ్యాంకు ఉందని రాష్ట్ర సామా న్య ప్రజా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జాకట శ్రీనివాస్ అన్నారు. సోమవారం మేడ్చల్లోని పార్టీ ప్రధాన కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జాకట శ్రీనివాస్ మాట్లాడుతూ నీ ఓటు వారి నోటు, అదే వారి బలం అనీ, సామాన్య ప్రజలు వారి ఓటు విలువ తెలుసు కునే రోజు తొందరలోనే ఉందన్నారు. త పార్టీ ప్రతి కార్యకర్త ఒక సైనికుడై సామాన్య ప్రజలను చైతన్యం చేసే బాధ్యతను తీసుకుంటామన్నారు. తాము రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీ ద్వారా రాష్ట్రంలోని సామాన్య ప్రజల అభివృ ద్ధికి సహకరిస్తాం అన్నారు. సామాన్య ప్రజల ఓట్ల ఐక్యత ను సమీకరిస్తాం అనీ, సామాన్య ప్రజల రాజ్యాధికారాన్ని సాధిస్తాం అని తెలిపారు. సోదర భావంతో పనిచేస్తామనీ, సంక్షేమ సమానత్వాన్ని అందిస్తామని తెలిపారు. మన ప్రభుత్వంలో రైతు పండించిన పంటకు వారి కష్టానికి గౌరవంగా మద్దతు ధర ఇస్తామనీ, కార్మికుల హక్కులను నూటికి నూరు శాతం అమలు చేస్తామని తెలిపారు. సామాన్య ప్రజలకు విద్య, వైద్యం, న్యాయం, ఉపాధి, కూడు, గూడు, నీరు రాష్ట్రంలోని ప్రతి సామాన్యునికి చేరేలా రాజ్యాంగం సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపా లన అందిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మీర్ అలీ, రాష్ట్ర కార్యదర్శి జాకట శ్రీకాంత్, మైనార్టీ విభాగం అధ్యక్షులు అబ్దుల్ వహీద్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు జె.ప్రేమ్ దాస్ పాల్గొన్నారు.