Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
ప్రజా సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని హైదర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని ప్రధాన రోడ్డులో పీఎన్ఆర్ కాంప్లెక్స్ డ్రయినేజీ లైన్ నిత్యం రోడ్లపై పోంగు తుందని విషయం తెలుసుకున్న కార్పొరేటర్ జలమండలి, ఇంజినీరింగ్ అధికారులు, శానిటేషన్ సిబ్బందితో పాటు కాంప్లెక్స్‌లోని అన్ని షాపుల, రెస్టారెంట్ల ఓనర్స్‌తో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఆధ్వాన్నంగా మారిన రోడ్లను మరమ్మ త్తులు చేయించి ట్రాఫిక్ సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. కార్యక్రమంలో జలమండలి మేనేజర్ ప్రశాంతి, సూ పర్వైజర్ నరేంద్ర, జీహెచ్ఎంసీ లింగారెడ్డి, ఎస్ఆర్పీ సత్యనారాయణ, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్ పాల్గొన్నారు.