Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
ప్రజల సమస్యలను అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సీఐట ీయూ, కేవీపీఎస్, పట్నం, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం హైదర్‌నగర్ బస్తీలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై సర్వే నిర్వ హించారు. ఈ సందర్భంగా ఫించన్, డ్రయినేజీ, రోడ్లు, శ్మశాన వాటిక అభివృద్ధి, బోరింగ్ మరమ్మత్తులు, దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని స్థానిక ప్రజలు వారి దృష్టికి తీసుకవచ్చారు. అనంతరం ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరిం చని పక్షంలో రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్నం, సీఐటీయూ, కేవీపీఎస్ నాయకులు పి.సత్యం, ఎం.శంకర్, బి.శ్రీను, బాలు, అశోక్, మహేష్, కృష్ణ, రాజేశ్వరి చారి, రమేష్, వెంకటేష్, నర్సింహా, తదితరులు పాల్గొన్నారు.