Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
కూకట్ పల్లి డివిజన్లోని హనుమాన్ నగర్ బస్తీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా కమిటీ సభ్యులు ఐలాపురం రాజశేఖర్, కూకట్పల్లి మండల నాయకులు కేతావత్ కృష్ణా నాయక్ మాట్లాడుతూ రెండు నెలలుగా హనుమాన్ నగర్ బస్తీలో మంచి నీరు రాక స్థానిక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. డ్రయినేజీ పై కప్పులు ధ్వంసమై రెండేండ్లు గడిచినా మరమ్మతులకు అధికారులు, ప్రజాప్రతినిధులు చేయకపోడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మోస పూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప ప్రజల కు చేసిందేమీ లేదనన్నారు. ప్రజల పక్షాన ప్రశ్నించేందుకు ఎర్ర జెండా అండగా ఉంటుందన్నారు. ప్రజా సమ స్యలను పరిష్కరించే వరకు పోరాడుతామన్నారు. డ్రయి నేజీ పైప్ లైన్ లీకేజీలతో తాగునీరు కలుషితమై తాగ డానికి నిరుపయోగంగా ఉందనీ, కొదరు కలుషిత నీటిని తాగడం వల్ల చిన్న పిల్లులు, పెద్దలు అనారోగ్యానికి గుర య్యారని తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో వాటర్ బోర్డ్, జీహెచ్ఎంసీ కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. సమ స్య పరిష్కారం అయ్యేవరకు వాటర్ బోర్డ్ అధికా రులు స్థానిక ప్రజలకు తాగడానికి, వాడుకోవడానికి వాటర్ ట్యాంక్లు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్ర మంలో కూకట్ పల్లి మండల నాయకులు ధర్మారావు, రం గారెడ్డి, నర్సమ్మ, వినోద, సాయిలు, ప్రవీణ్ పాల్గొన్నారు.