Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
నవతెలంగాణ-కేపీహెచ్బీ
పేద విద్యార్థులలో సాంకేతిక నైపుణ్యాన్ని మెరుగుపరిచేం దుకు చేతన్ ఫౌండేషన్ ల్యాప్టాప్లు అందజేయడం అభినందనీయమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. సోమవారం చేతన్ ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్యే కోనేరు కొనప్ప పాల్గొని 20 మంది పేద విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ల్యాప్టాప్లను సద్వినియోగం చేసుకుని తమ తమ రంగాల్లో ఉన్నత శిఖ రాలను అధిరోహించాలన్నారు. విద్యార్థులు మరింత ఉన్నత స్ధాయికి ఎదిగి మరింత మందికి సాయం చేయాల న్నారు. చేతన్ ఫౌండేషన్ చైర్మన్ రవి 8 దేశాల్లో ఫౌండేషన్ సేవలను కొనసాగించడం సంతోషంగా ఉందన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని సమాజం కోసం ఎంతో కొంత తమకు తోచిన విధంగా సహహం చేయాలని తెలి పారు. విద్యార్థుల్లో ఉన్న సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే వెయ్యి ల్యాప్టాప్లు విద్యార్ధులకు అందజేశారన్నారు. నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, దుప్పట్లు అందజేస్తూ పలువురికి ఆదర్శంగా చేతన్ ఫౌండే షన్ నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, చేతన్ ఫౌండేషన్ ప్రతినిధులు సీతారామారావు, సురేష్, వెంకట రమణి, నాగేశ్వరావు, ప్రదీప్, రజినీకాంత్ పాల్గొన్నారు.