Authorization
Fri March 21, 2025 08:12:24 am
నవతెలంగాణ-బాలానగర్
కూకట్పల్లి సర్కిల్ బాలానగర్ డివిజన్ పరిధిలో విధాత చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు సుజాత గౌడ్ ఆధ్వర్యంలో పేద వృద్ధులకు నెలకు సరిపడే నిత్యావసరాల సరుకులను మంగళవారం స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ విధాత చారిటబుల్ ట్రస్ట్ వారు నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజెన్ అధ్యక్షులు రామచంద్రయ్య, డివిజన్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాజా, మహిళా విభాగం అధ్యక్షు రాలు కె.కవిత, మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ సోఫీ, నాయకులు వెంకటేష్ గౌడ్, నర్రా దేవేందర్ రెడ్డి, కందుల రమేష్, లక్ష్మణ్, నాగరాజు గౌడ్, సాయి గౌడ్, రేణుకా గౌడ్, సులోచన రెడ్డి, మధులత, అప్సర, మన్నే శ్రీలత, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.