Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కుత్బుల్లాపూర్, బాచుపల్లి, దుండిగల్-గండిమైసమ్మ మండలాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందనీ, వీటిని అరికట్టాలని కోరుతూ సోమవారం సీపీఐ కుత్బుల్లా పూర్ సమితి తరపున మేడ్చల్ జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉమా మహేష్ మాట్లాడు తూ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు సర్వే నెంబ ర్లతో సహా ప్రాంతాల పేర్లను వినతిపత్రంలో ఇచ్చామనీ, ఇవే నెంబర్లతో గతంలో కూడా చాలాసార్లు స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చినా ఆ కబ్జాలు మాత్రం ఆగకుండా మరింత పెరుగుతున్నాయని తెలిపారు. కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారనీ, ఇలాగే కొనసాగితే రాను న్న రోజుల్లో ప్రభుత్వ భూమి కనిపించదేమో అన్నారు. ఇలాగే కొనసాగితే సీపీఐ ఆధ్వర్యంలో పేదలకు భూము లు పంచడానికి మరో భూపోరాటం చేస్తామని హెచ్చరిం చారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు వెంకటేష్, శ్రీనివాస్, నరేంద్రచారి, అంకయ్య, రవీందర్ పాల్గొన్నారు.