Authorization
Tue March 18, 2025 02:20:02 am
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిం చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో వచ్చిన సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో వీలైనంత త్వరగా పరిష్కరించాలనీ, ఈ విషయంలో సంబంధిత అధికా రులు బాధ్యత వహించాల్సి ఉంటుందని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్తో కలిసి నిర్వహించారు. ఈ మేరకు ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 63 మంది తమ వినతులను, సమస్యలను, దరఖా స్తులను స్వీకరించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి తమ సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతో దూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ప్రజావాణిలో తమ సమస్యలను విన్నవించుకుంటారనీ, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా శాఖల జిల్లా అధికారులు తప్పకుండా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావా లని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తులు, వినతులను వీలైనంత త్వరగా పరిష్కరిం చాలని సూచించారు. ప్రజావాణిలో తమకు న్యాయం జరుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలని పేర్కొ న్నారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తు, సమస్య లను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్ర మంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.