Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- 'మన బస్తీ-మన బడి' ప్రారంభం
నవతెలంగాణ-ముషీరాబాద్/అంబర్‌పేట
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అన్ని ఆధునిక హంగులతో నిర్మిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మన బస్తీ, మన బడి కార్యక్రమంలో భాగంగా సోమవారం ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే ముఠాగోపాల్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతనంగా నిర్మించనున్న ముషీరాబాద్ పాఠశాల భవనంలో 20 తరగతి గదులు, డైనింగ్ హాల్, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక ఫర్నిచర్, ఆధునిక మరుగుదొడ్లు, నిరంతర మంచినీటి సౌకర్యం, ప్రహరీ నిర్మాణం, గ్రీన్‌చాక్ పీస్ బోర్డులు తదితర సౌకర్యాలు ఉండేవిధంగా నిర్మాణ పనులు చేపడుతామని చెప్పారు. స్కూల్లో ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నా వెంటనే సమకూరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ త్వరలో జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలు సైతం నిర్మించి ముషీరాబాద్ నియోజకవర్గం ప్రజలకు ఉత్తమ విద్య అందించేందుకు తన వంతు కషి చేస్తున్నాన్నారు. కార్యక్రమంలో గాంధీనగర్ మాజీ కార్పొరేటర్ పద్మ నరేష్, రాష్ట్ర యువ నాయకులు ముఠా జై సింహ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముఠా నరేష్, ప్రెసిడెంట్లు డివిజన్ ప్రెసిడెంట్ వై శ్రీనివాస్, నర్సింగ్ ప్రసాద్, రాకేష్ కుమార్, ఆర్ మోజెస్, శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శులు, ఆకుల అరుణ్ కుమార్, దామోదర్ రెడ్డి, సురేందర్, సాయి కష్ణ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం అంబర్‌పేట సీపీఎల్ లేన్‌లోని ప్రభుత్వ పాఠశాలలో మనబస్తీ-మనబడి కార్యక్రమంలో భాగంగా రూ.80 లక్షలతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ ఇ.విజరుకుమార్గౌడ్తో కలిసి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించారు. ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి హైదరాబాద్ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తరగతులను ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో విద్యా శాఖ అధికారులు, హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందితో పాటు అంబర్‌పేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు సిద్ధార్థ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.