Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
వైజ్మెన్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ సెంట్రల్, వై.ఎస్.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో ఇటీవల 'మనసులో మాట' అంశంగా కవితలు పంపాలని కవులను కోరగా దాదాపు 50కి పైగా కవులు పాల్గొన్నారని సంస్థ నిర్వాహకులు వై. శ్రీరామచంద్ర మూర్తి తెలిపారు. వైజ్ మెన్ సంస్థ కార్యాలయంలో వీరికి సత్కార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ కవిత్వం భాషను మెరుగు పరచుకొనేందుకు ఉపయోగ పడుతుందన్నారు. క్లుప్త పదాలతో సజనాత్మక ప్రక్రియ కవిత అని మనస్సులోని భావాలు వ్యక్త పరిచేందుకు సులువైన మాధ్యమం కవిత అని వివరించారు. రచయిత, కళా పోషకులు జీ.వెంకట రెడ్డి పాల్గొని కవితలన్నీ అలోచనాత్మకంగా ఉన్నాయని అన్నారు. రామలింగేశ్వర రావు, సర్వేశ్వర రావు, యశోబు నేటి కవితా ధోరణులపై ప్రసంగించారు. రచయిత్రి శహన ఖాన్ కవులకు తన శుభాకాంక్షలు తెలిపారు.