Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
హనుమాన్ టెక్డీ ప్రాంతంలో గతేడాది నుంచి సీవరేజ్ సమస్య తీవ్రంగా ఉందని స్థానిక ప్రజలు గోషామహల్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకుడు ఎం. ఆనంద్ కుమార్ గౌడ్ దష్టికి తీసుకొని వచ్చారు. కాగా సోమవారం బస్తీలలో ఆయన పర్యటించారు. సీవరేజ్ సమస్య వల్ల తీవ్ర దుర్వాసనతో స్థానిక ప్రజలు అనారోగ్యం పాలయ్యారని స్థానికులు ఆయనకు వివరించారు. వికలాంగులు, వద్ధులు, గర్భిణీలు ఆ మురుగు నీటి కారణంగా కిందపడి గాయలపాలయ్యారని దష్టికి తీసుకువచ్చారు. తమ సమస్యలను జలమండలి అధికారులు దష్టికి తీసుకెళ్లామని, ఫిర్యాదు చేయడానికి వచ్చిన తమను మహిళలమని కూడా చూడకుండా తమపై దురుసుగా ప్రవర్తించి తాగునీటి సరఫరాను కూడా నిలిపివేస్తామని బెదిరించినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జె. అశోక్ కుమార్ యాదవ్, రాజేందర్, సీహెచ్. నీలేష్ కుమార్, సీహెచ్ అశోక్ కుమార్, విజరు కుమార్, హెచ్. అవినాష్, నవీన్ కుమార్ యాదవ్, శ్రీనివాస్, సునీల్, అనిల్, వెంకటేష్ పాల్గొన్నారు.