Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ అపోలో మెడికల్ కాలేజీలో 'ప్రజారోగ్యంలో తాజా నవీకరణలు' అనే అంశంపై అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ దశాబ్దపు వేడుకలను పురస్కరించుకొని, ఒకరోజు కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నీరజ్ అగర్వాల్, మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ హెడ్ కమ్యూనిటీ, ఫ్యామిలీ మెడిసిన్ ఎయిమ్స్ బీబీనగర్, దీప ప్రజ్వలన, డాక్టర్ సునీత రెడ్డి ఇన్ఫెక్షన్ డిసీజెస్ స్పెషలిస్ట్ అపోలో జూబ్లీ హిల్స్ హాస్పిటల్, వారితో కలిసి ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పోస్టు గ్రాడ్యుయేట్లు క్విజ్, పబ్లిక్ హెల్త్ వీడియో పోటీల్లో పాల్గొన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులు క్విజ్ పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచారు. వరంగల్ కాకతీయ వైద్య కళాశాలకు ద్వితీయ, తతీయ, బహుమతులు లభించాయి. ప్రజారోగ్య సందేశంతో కూడిన ఉత్తమ వీడియోగా గాంధీ వైద్య కళాశాల అవార్డు గెలుచుకుంది. భవిష్యత్తులో భూమిపై ఉన్న ప్రజలు ఎదుర్కొనే ఆహారం, నీటి కొరతపై చూయించిన వీడియో అందరి దష్టి సారించిందని అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2022 థీమ్ 'అవర్ ప్లానెట్ అవర్ హెల్త్' ఆధారంగా ఈ పోటీలు నిర్వహించారు.