Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు
నవతెలంగాణ-ముషీరాబాద్
భారతీయ సంస్కతీ, సంప్రదాయాలను కళాకారులు ప్రపంచానికి చాటుతున్నారని విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు అన్నారు. సోమవారం సాయంత్రం సుందరయ్య కళానిలయంలో నటరాజ్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయుడు వేముల శరత్చంద్ర (యూఎస్ఏ) ఉత్తమ కళాసేవా పురస్కారం 2022 ప్రదానోత్సవం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవులు, చినుకు సంస్థ ప్రధాన కార్యదర్శి, సామాజిక వేత్త పీఎన్ మూర్తి, అధ్యాపకులు ఉదయశ్రీ, ప్రముఖ జానపద గాయకుడు దండేపల్లి శ్రీనివాస్, దైవజ్ఞశర్మ, నటరాజ్ అకాడమీ సంస్థ వ్యవస్థాపకుడు గిరి తదితర వక్తలతో కలిసి పురస్కారం అందజేశారు. అనంతరం చిరంజీవులు మాట్లాడుతూ మన దేశంలో కళలు, సాహిత్య రంగానికి గొప్ప చరిత్ర ఉందన్నారు. ఇక్కడి కళలను ప్రపంచానికి చాటి దేశ ప్రతిష్టను పెంచుతున్న కళాకారుల కషి మరువలేనిదన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌కు చెందిన ప్రవాస భారతీయుడు వేముల శరత్చంద్రకు భారతీయ కళలపట్ల ఎంతో మక్కువ ఉందన్నారు. ఇక్కడి కళాకారులు అమెరికాలో సాంస్కతిక ప్రదర్శనలు చేస్తుంటే వారిని ఆదరించడం, ఆదుకోవడంలో గొప్ప సామాజిక గుణం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. అలాంటి వారితోనే మన కళలకు మరింత ప్రాచూర్యం సాధ్యపడుతోందన్నారు. కళాకారులను, కళలను ప్రభుత్వం ఆదరించాలని కోరారు. అనంతరం వక్తలను సన్మానించారు. ముందుగా జానపద కళాకారుడు శ్రీనివాస్ నేతత్వంలో వేముల శరత్చంద్ర చేసిన సేవలపై రూపొందించిన ఆడియోసీడీని విడుదల చేశారు. పలువురు విద్యార్థినిలు ప్రదర్శించిన పలు నత్య ప్రదర్శనలు అలరించాయి.