Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.23.65 కోట్లతో 310 ఇండ్ల నిర్మాణం
- ప్రారంభించనున్న మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను దశల వారీగా అందుబాటులోకి తెస్తున్నారు. 111 ప్రాంతాల్లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం లక్ష్యం కాగా ఇప్పటి వరకు సుమారు 70 వేలకుపైగా నిర్మాణాలు పూర్తి చేశారు. బన్సీలాల్ పేటలోని బండమైసమ్మ వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను రేపు మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు.
బన్సీలాల్‌పేటలోని బండమైసమ్మ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను 5 బ్లాక్‌లలో సిల్ట్+5 విధానంలో 310 ఇండ్లను రూ.26.35 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఒక్కొక్కటి 560 చదరపు అడుగుల్లో రూ.7.75లక్షల వ్యయంతో నిర్మించారు. మౌలిక సదుపాయాలు, ఇతర వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను డిగ్నిటీ కాలనీగా నిర్మించారు. సిమెంట్ రోడ్డు, డ్రయినేజీ ఎలక్ట్రిసిటీ పోల్స్ ఏర్పాటు మొత్తం రూ.2.32కోట్ల వ్యయంతో చేపట్టారు. డిగ్నిటీ కాలనీలో 350 మీటర్ల సీసీరోడ్డు, 300 మీటర్ల సీవరేజ్ లైన్, 100 కేఎల్ సామర్థ్యం గల తాగునీటి కోసం సంపు, వీధిదీపాల ఏర్పాటు, 11 లిఫ్టులు, కాలనీ వాసులకు నిత్యావసర వస్తువులు, ఇతర వస్తువుల కోసం బయట ప్రదేశాలకు వెళ్లకుండా 16 షాపింగ్ షటర్స్లు కూడా ఏర్పాటు చేశారు.
రేపు ప్రారంభం
సనత్‌నగర్ నియోజకవర్గంలో బన్సీలాల్‌పేటలోని బండ మైసమ్మ వద్ద రూ.23.65కోట్ల వ్యయంతో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను ఆదివారం రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల, గహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.