Authorization
Fri March 21, 2025 06:15:03 pm
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
నవతెలంగాణ-ఎల్బీనగర్
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలను ఆపద సమయంలో ఆదుకుంటోందని, ఎంతోమందికి దీని ద్వారా మేలు జరుగుతోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. చంపాపేట డివిజన్‌కు చెందిన శ్యామ్‌సుందర్ కడుపునొప్పి సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్లో చేరాడు. చికిత్స పొందిన అనంతరం హాస్పిటల్ బిల్లులతో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని సంప్రదించాడు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అతని ఆపరేషన్‌కు సంబంధించిన బిల్లులతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేయించగా మంజూరైన రూ. 2,50,000 లకు సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేదలు నాణ్యమైన అధునాతన వైద్య సేవలను పొందేందుకు సీ.ఎం.సహాయనిధి ఎంతో తోడ్పడుతోందన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నల్ల రఘుమా రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ముడుపు రాజిరెడ్డి, మహిళా అధ్యక్షురాలు రోజారెడ్డి, డివిజన్ బీసీ విభాగం అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్, మహిళా విభాగం జనరల్ సెక్రటరీ ఉష, ఉమ మహేశ్వర్, భానుప్రకాశ్, వసంత, రాజు పాల్గొన్నారు.