Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తల ఫిర్యాదు
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజాప్రతినిధులు గుత్తేదారు అవతారమెత్తిన ఘటనపై నవతెలంగాణలో శుక్రవారం ప్రచురించిన 'పదవుల మాటున పైసలదందా' కథనంతో అధికార యంత్రాంగం స్పందించింది. బోడుప్పల్ కార్పొరేషన్‌కు చెందిన సామాజిక కార్యకర్త దేవరకొండ వెంకటాచారి జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, అందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బోడుప్పల్ కమిషనర్ పద్మజా రాణికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ విషయం జిల్లా కలెక్టర్, ఆర్డీవోల దృష్టికి వెళ్లింది. రెండేండ్ల కిందట జరిగిన అవకతవకలపై అధికారులు ఇన్ని రోజులు ఎందుకు తాత్సారం చేశారనే కోణంతో పాటు, ఇందులో ఇంజినీరింగ్ విభాగం అధికారుల చేతివాటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బయటకు వచ్చింది ఈ ఒక్క ఘటనే. ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయోననే కోణంలో పారదర్శకంగా విచారణ జరిపించాలని బోడుప్పల్ కార్పొరేషన్వాసులు డిమాండ్ చేస్తున్నారు.