Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
విధినిర్వహణలో మృతి చెందిన మహిళా కానిస్టేబుల్ కుటుంబానికి పోలీస్ అధికారులు ఎక్స్గ్రేషియా అందజేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ జ్యోత్స్న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, దాదాపు 38 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం రాచకొండ పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మృతురాలి కుటుంబసభ్యులకు అధికారులు ఎక్స్గ్రేషియా అందజేశారు. సీపీ మహేష్ భగవత్ ఆదేశాలతో అదనపు డీసీపీ శ్రీనివాసులు బాధిత కుటుంబసభ్యులకు ఎక్స్ గ్రేషియా కింద రూ. 8 లక్షలు, వెల్ఫేర్ ఫండ్ నుంచి రూ. 5 లక్షల చెక్కులను అంద జేశారు. కార్యక్రమంలో సీఏఓ అడ్మిన్ పుష్పరాజ్, సూపరింటెండెంట్ గఫార్, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు భద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.