Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షటిల్ టోర్నమెంట్ విజేత రామ్‌నగర్ టీం
నవతెలంగాణ-ముషీరాబాద్
తెలంగాణ తొలి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్మారక షటిల్ టోర్నమెంట్ పోటీలు పార్సిగుట్ట మున్సిపల్ కాలనీలోని జీహెచ్ఎంసీ మినీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఘనంగా ముగిశాయి. నాయిని ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, తెలంగాణ స్పోర్ట్స్ చైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి, తైక్వాండో అంతర్జాతీయ ఛాంపియన్ సింధూ తపస్వి, ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్, టీఆర్ఎస్ నగర నాయకులు ఎమ్ఎన్ శ్రీనివాసరావు, అదిబాబు యాదవ్ తెలంగాణ జన సమితి హైదరాబాద్ అధ్యక్షులు నరసయ్య, జనతా దళ్ సీనియర్ నాయకులు సూరి, ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి హాజరై బహుమతులను పంపిణీ చేశారు. ఈ పోటీల్లో 64 జట్లు పాల్గొనగా రాంనగర్ మయూరి అండ్ మనోజ్ టీం విజేతగా నిలవగా, పార్సిగుట్ట మున్సిపల్ కాలనీ టీం రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కార్యక్రమంలో క్రీడాకారులు బొల్లం శ్రీనివాస్, సీహెచ్ వీరారెడ్డి, పరమేశ్వర్, వామన్ మురళి, రామేశ్వర రావు, డాక్టర్ అశోక్, జైపాల్ రెడ్డి, మహేష్, రమణ, సుధాకర్, రాము, నగేష్, టీఆర్ఎస్ నాయకులు నేత శ్రీనివాస్, కార్తీక్ యాదవ్, గోపి, పుణ్య సత్యనారాయణ, రోహిత్ గౌడ్, అస్లాం తదితరులు పాల్గొన్నారు.