Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
పేదలకు సహాయం చేసేందుకు వీలుగా తనకు ప్రాజెక్టు ఇచ్చేందుకు అంగీకరించిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌కు ఏక్ దిశ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు జ్యోతి దాస్ కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ హెచ్చార్సీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కౌన్సిల్ సౌత్ ఇండియా అధ్యక్షులు థామస్ సభ్యత్వ కార్డును జ్యోతికి అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ నూతన ఎన్జీవోలు మరింత ఉత్సాహంగా పని చేసేందుకు హెచ్చార్సీ ప్రోత్సహించిందని తెలిపారు. వారిచ్చిన గైడెన్స్ తనకు ఉపయోగపడిందన్నారు. థామస్ మాట్లాడుతూ ఎన్జీవోలు కౌన్సిల్లో సభ్యత్వం తీసుకోవడం రకరకాల ప్రాజెక్టులను పొందవచ్చనీ, తద్వారా పేదలకు మరింత సేవ చేసే అవకాశముందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్చార్సీ ఉమెన్స్ ఫ్రంట్ నాయకురాలు షీబా తదితరులు పాల్గొన్నారు.