Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్ నగర్
రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు, అభివృద్ధికి సహకరించ కుండా అమిత్ షా ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నాడనీ, టూరిస్టులా వచ్చి పోదామంటే కుదరదని రంగారెడ్డి జిల్లా మాదిగ యూత్ జేఏసీ అధ్యక్షుడు నక్క శరత్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆర్కెపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణకు ఏ విధంగా సహకరించకపోవడంతోపాటు అడ్డంకులు సృష్టిస్తున్న బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో బండి సంజరు పాదయాత్ర చేస్తున్నాడని ప్రశ్నించారు. ఏ ప్రయోజనం కోసం పాదయాత్ర చేపట్టారో ప్రజలకు చెప్పాలన్నారు. బీజేపీ ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చా ఎనిమిదేండ్లు గడుస్తున్నా కేంద్రం దగ్గరే ఆగిపోయిందన్నారు. ఎందుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అంటే అంతా చులకనగా అయిపోయారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ఎలాంటి మేలు చేయనప్పుడు మీ ఎంపీ పదవి ఉంటే ఎంత ఊడితే ఎంత అనీ, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాయి, ప్రశాంత్,రాజు, ధనరాజ్, తదితరులు పాల్గొన్నారు.