Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా అమృతానాయుడు
నవతెలంగాణ-బడంగ్‌పేట
బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ మహళా అధ్యక్షురాలిగా అమృతానాయుడు నియామక మయ్యారు. శుక్రవారం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దబావి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతా రావు చేతుల మీదుగా అమృతా నాయుడు నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకే కోవర్ట్ రాజకీయాలకు పాల్పడే వారిని ఎంత పెద్ద నాయకులైన ఒదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షురాలు నియామకం కోసం రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు ఎందుకు రావాల్సి వచ్చిందంటే నిజమైన కార్యకర్తలకు భరోసా ఇవ్వడం కోసమే అన్నారు. ఇక్కడ జరిగిన కోవర్ట్ రాజకీయాలను రాష్ట్ర స్థాయి నాయకులకు తెలియజేసి, వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలి పారు. కార్యక్రమంలో మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి, పాల్గొన్నారు.