Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్ స్కూల్ ఆఫ్ లా ఆహ్వానం మేరకు డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా ఉస్మానియా, తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఈనెల 16న జమ్మూకాశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఈనెల 18న జరిగే సదస్సులో 'కాశ్మీరు రాజ్యంగహక్కులు-ప్రస్తుత హోదా' అనే అంశంపై ఆయన ప్రసగించనున్నారు. శుక్రవారం ఓయూలని తన క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాశ్మీర్ ప్రజల హక్కులు, అభివద్ధి, శాంతి పరిరక్షణ భారత రాజ్యాంగం ద్వారా ఎలా పొందాలో అవగాహన కల్పించడంలో భాగంగా ఎక్స్పర్ట్ ప్రసంగాన్ని తాను ఇవ్వబోతున్నట్లు తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 370 రద్దును కోరుకున్నారని బీజేపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అంబేద్కర్ అన్ని రాష్ట్రాలతో సమానంగా కాశ్మీరు ఉండాలని భావించినప్పటికీ ఆనాటి ప్రత్యేక పరిస్థితుల దష్ట్యా కాశ్మీరు ప్రాంత స్వయంప్రతిపత్తిని కోరుకున్నారని చెప్పారు. సమావేశంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులు దుర్గం శివ, శ్రీనివాస్ పాల్గొన్నారు.