Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- రూ.5.15 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-బడంగ్పేట్
జల్పల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటానికి తన వంతు కృషి చేస్తానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో రూ. 5.15 కోట్లతో చేపట్టే వివిధ అభివద్ధి పనులకు మున్సిపల్ చైర్మెన్ అహమ్మద్ సాది, వైఎస్ చైర్మెన్ పర్హానా నాజ్, కమిషనర్ డా.జి.ప్రవీణ్ కుమార్ లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుపడానికి ఎంతో కషి చేస్తున్నామని తెలిపారు. మున్సిపల్లో ముఖ్యంగా ప్రజల మౌలిక సదుపాయాల కల్పన కోసం అధిక మొత్తంలో నిధులు మంజూరు చేయటం జరుగుతుందని, అందులో డ్రయినేజీలు, రోడ్లు, వరద కాల్వల నిర్మాణం, తాగునీరు, వీధిదీపాల నిర్వహణ కోసం ప్రాధాన్యత ఇస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో రీప్రజెంటివ్ వైఎస్ చైర్మెన్ యూసుఫ్ పటేల్, కౌన్సిలర్లు యాహియా, షేక్ పమీద అఫ్జల్, శంషోద్దీన్, లక్ష్మీనారాయణ, శంకర్, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షులు ఎక్బాల్ ఖలీఫా, నాయకులు, అధికారులు వివిధ కాలనీల ప్రజలు పాల్గొన్నారు.