Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ అరవింద్ దిష్టిబొమ్మను మహాజన సోషలిస్టు పార్టీ ఎల్బీ నగర్ ఇన్చార్జి బత్తిని సుధాకర్ ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ కేసీిఆర్, అరవింద్ ఇద్దరు వెంటనే రాజీనామా చేసి రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలన్నారు. ధర్మపురి అరవింద్‌పై పార్టీపరంగా పార్టీ సభ్యత్వాన్ని పార్లమెంటు సభ్యుడిపై నిర్ణయం తీసుకున్న వెంటనే సభ్యత్వానికి పార్లమెంటు సభ్యత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ డివిజన్ నాయకులు కొత్తపేట డివిజన్ అధ్యక్షుడు కొమ్ము శేఖర్ మాదిగ, చంపాపేట్ డివిజన్ అధ్యక్షుడు మల్లె రాజు మాదిగ, మహాజన సోషలిస్టు పార్టీ నాయకులు రవి, చిరంజీవి, నరసింహ, సాయి, రాజు, నరసింహ, నాగరాజు, చంద్రశేఖర్, నిచ్చెన స్వామి తదితరులు పాల్గొన్నారు.