Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
నవతెలంగాణ-అంబర్‌పేట
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఉచిత విద్యుత్‌తో రజక, నాయీ బ్రహ్మణులకు ఎంతో లబ్ది చేకూరుతోందని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఆదివారం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కార్పొరేటర్ ఇ.విజయకుమార్గౌడ్తో కలిసి అంబర్‌పేట డివిజన్ ప్రేమ్‌నగర్‌లో పర్యటించి లాండ్రీ షాప్‌లో ఉచిత విద్యుత్ మీటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశంలో ఏ నాయకుడూ ఆలోచన చేయని విధంగా పేదల అభివద్ధికి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నారని చెప్పారు. రజక, నాయీ బ్రహ్మణులు 250 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా వినియోగించుకోవాలని సూచించారు. కుల వత్తిదారులను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఆమనూరి సతీష్, మహేష్ ముదిరాజ్, పి. నర్సింగ్, సంతోష్‌చారి తదితరులు పాల్గొన్నారు.