Authorization
Sun March 30, 2025 12:48:22 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోలక్‌పూర్‌లో ఇటీవల వరుస అగ్ని ప్రమాదాలు జరగడంతో సోమవారం స్క్రాప్ గోదాముల యజమానులతో ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ జహంగీర్ యాదవ్ అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్, ఇతర స్క్రాప్‌ను రోడ్డుపై వేయవద్దని స్థానికులకు ఇబ్బంది కలిగించేలా వాహనాలను పార్కింగ్ చేయరాదని సూచించారు. ప్రతి గోదాములో ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు.