Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ జి.మహాలక్ష్మి
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
మంచి భవిష్యత్తు కోసం విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే మార్పు రావాల్సిన అవసరం ఉందని హిమాయత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ జి.మహాలక్ష్మి అన్నారు. సోమవారం హిమాయత్‌నగర్‌లో తెలంగాణ సైకాలజిస్టుల అసోసియేషన్ 5వ వార్షికోత్సవ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సైకాలజిస్టుల అసోసియేషన్ నేటికి ఐదు వసంతాలు పూర్తి చేసుకోవడం హర్షించదగ్గ పరిణామమన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించుటకు, చదువు పట్ల ఒత్తిడి తగ్గించుటకు పాఠశాలల్లో సైకాలజిస్టులను నియమించవలసిన అవసరం ఉందన్నారు. తమ డివిజన్లోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేలా తన వంతు కషి చేస్తామని అన్నారు. సైకాలజిస్టుల కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించిన విషయాన్ని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి దష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అనంతరం తెలంగాణ సైకాలజిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మోతుకూరి రాంచందర్ మాట్లాడుతూ సమాజ సేవే ఆదర్శంగా యువత మార్పే ధ్యేయంగా పని చేస్తున్న ఏకైక సంస్థ తమదేనని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంపటి రాజు, కార్యదర్శి డాక్టర్ లక్ష్మి నిప్పణి, నాయకులు కె.షర్మిలా, డాక్టర్ శిల్పా, రహమత్ సుల్తానా, సుధాకర్, జగదీశ్వర్‌రావు పాల్గొన్నారు.